వైయస్ జగన్ కు పిసిసి పదవికి 'నో'

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ కు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవి ఇవ్వడానికి కూడా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించినట్లు సమాచారం. వైయస్ జగన్, ముఖ్యమంత్రి కె.రోశయ్యలతో భేటీలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రోశయ్యకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కాలం ముఖ్యమంత్రిగా రోశయ్యను కొనసాగించాలనే నిర్ణయానికి ఆమె వచ్చారు. ఇదే విషయాన్ని ఆమె రోశయ్యకు చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర రెడ్డి వంటి వారు ఇదే విషయాన్ని చెబుతున్నారు. పాలనా యంత్రాంగంలో ఆయన తన ఇష్టానుసారం వ్యవహరించేందుకు అవసరమైన వెసులుబాటు ఆయనకు లభించింది.

కాగా, జగన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి అవసరమైన వెసులుబాటును కల్పించేందుకు సోనియా సిద్ధంగా లేరు. పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కూడా సోనియా జగన్ కు పచ్చజెండా ఊపే పరిస్థితి లేదు. 2014లో ఎన్నికలు జరిగే వరకు జగన్ కు రాష్ట్ర రాజకీయాల అశలు సన్నగిల్లినట్లే. కేంద్ర మంత్రి పదవిపైనే జగన్ ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితే ఉంది. జగన్ కు కీలక పాత్ర ఇచ్చేందుకు సోనియా ఏ మాత్రం ఇష్టపడడం లేదు. జగన్ తనకే సవాల్ విసిరినట్లు సోనియా భావించినట్లు చెబుతున్నారు. దీంతో జగన్ కు ముకుతాడు వేయడం మినహా మరో మార్గం లేదనే కచ్చితమైన నిర్ణయానికి ఆమె వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+