హెడ్లీ'రాహుల్' మహేష్ భట్ కుమారుడు?

హెడ్లీ లష్కరే తోయిబా నేతలకు చేసిన ఇ - మెయిల్ లో రాహుల్ అనే పేరు పలు మార్లు ప్రస్తావించాడు. అయితే ఆ రాహుల్ షారూఖ్ ఖాన్ గానీ రాహుల్ గాంధీ గానీ కావచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి. అయితే అతను ఫిట్నెస్ ఇన్ స్ట్రక్టర్, బాడీ బిల్డర్ 25 ఏళ్ల రాహుల్ భట్ అని తెలుస్తోంది. ఇతను మహేష్ భట్ కుమారుడు. జిమ్ లో రాహుల్ భట్ కు హెడ్లీతో పరిచయమైంది. అయితే రాహుల్ కు అతను ఏమిటో తెలిసి ఉండదని పోలీసులు అంటున్నారు. రాహుల్ ను దర్యాప్తు అధికారులు విచారించి క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications