• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గల్లా అరుణకుమారికి బెదిరింపు కాల్

By Pratap
|

Galla Aruna Kumari
తిరుపతి: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారికి శనివారం నక్సలైట్ల పేరుతో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తమ ఉద్యమానికి నిధులు ఇవ్వాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ అజ్ఞాతవ్యక్తి గల్లా అరుణకుమారి పర్సనల్ అసిస్టెంట్ కు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ విషయాన్ని పిఎ మంత్రికి తెలిపారు.

తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ పై గల్లా అరుణకుమారి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక బాక్రాపేట కాయిన్ బాక్స్ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు వారు గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X