తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు

హరీష్ రావును అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులకు, తెరాస కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రాఘవాపూర్ కు బయలుదేరిన మాజీ శాసనసభ్యుడు దొమ్మాట రామలింగారెడ్డిని, తెరాస కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణను కూడా కార్యకర్తలతో పాటు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు కూడా రాఘవాపూర్ కు బయలుదేరారు. దీంతో రాఘవాపూర్ నివురు గప్పిన నిప్పులా ఉంది.












Click it and Unblock the Notifications