శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య సోమవారం ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. తమకు అందిన సమాచారం మేరకు భారత భద్రతా బలగాలు శ్రీనగర్ కు 40 కిలోమీటర్ల దూరంలో గల సంగుసూని గ్రామాన్ని చుట్టుముట్టారు. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఒక ఇంట్లో తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు దాన్ని చుట్టుముట్టాయి.
ఆ సమయంలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురు కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.