ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గం: రోశయ్య

ఓబుళాపురం వ్యవహారంలో వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించామని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం కూలంకషంగా అధ్యయనం చేసి పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అపోహలకు తావు లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా న్యాయబద్దంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను అవగతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిగా అధ్యయనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications