హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ముగ్గురు ర్యాగింగ్ కేసులో అరెస్టయ్యి రిమాండులో ఉన్నారు. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రేమ్ సాగర్, రోహిత్, కార్తీక్‌లు తనని ర్యాగింగ్ చేసినట్లు బీటెక్ మొదటిసంవత్సరం విద్యార్థి వినీష్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.