హెలిప్యాడ్‌తో.. టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో.. తెలంగాణాలో ఆ పండ్ల మార్కెట్!

తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యంత పెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో 179ఎకరాల విస్తీర్ణంలో ఒక వెయ్యి 91కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ మెగా ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. అయితే దేశంలోనే అత్యంత పెద్ద అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ పండ్లమార్కెట్ కు సంబంధించిన విశేషాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్

ఈ మార్కెట్లో భారీ భవనాల సముదాయం ఉంటుంది. విశాలమైన ఓపెన్ ప్లాట్ఫామ్ లు, కోల్డ్ స్టోరేజ్ లు, ట్రక్ డాకింగ్ షెడ్లు, డ్రయింగ్ రూమ్స్ , వివా ఆధారిత సేవలు, డేటా సెంటర్, ఎగుమతుల కోసం కస్టమ్స్ కేంద్రం కూడా ఉంటుంది. అంతా అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఎగుమతిదారులకు అవసరమైన అన్ని సేవలు ఒకే చోట ఇక్కడ అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేశారు.

Koheda international fruit market with helipads and tower of excellence project aims to boost fruit trade

వంద అడుగుల ఎత్తులో ప్రతిభా సౌధం.. హెలీ ప్యాడ్ లు కూడా

పండ్ల మార్కెట్లో వంద అడుగుల ఎత్తులో 19375 చదరపు అడుగుల స్థలంలో ప్రతిభా సౌధం నిర్మిస్తున్నారు. దీనిని టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పిలుస్తారు. ఇందులో నాలుగు అంతస్తులను వ్యాపార సంస్థలకు కేటాయిస్తారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యంతో పాటు ఆరు హై స్పీడ్ ప్యాసింజర్ లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. అవసరానికి తగ్గట్టు హెలిపాడ్ లను కూడా ఈ పండ్ల మార్కెట్లో నిర్మిస్తున్నారు.

179 ఎకరాలలో జాతీయ మార్కెటింగ్ మండలి నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం

రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతి సంస్థలకు లీజ్ పైన ఫ్లోర్ లను కేటాయిస్తారు. ఓఆర్ఆర్ సమీపంలోని 179 ఎకరాలలో జాతీయ మార్కెటింగ్ మండలి నిబంధనలకు అనుగుణంగా ఈ మార్కెట్ నిర్మాణానికి డీపీఆర్ తయారు చేశారు. ఈ మార్కెట్లో ఫారిన్ ఫ్లాగ్ షిప్ పెవిలియన్ పేరిట విదేశీ పండ్లను నిల్వ చేయడానికి, క్రయవిక్రయాలు జరపడానికి మూడు భారీ షెడ్లను నిర్మిస్తారు.

డిసెంబర్ 9 నాటికి రైతులకు అందుబాటులోకి

పండ్లు, పూలు, పాడి, చేపలు, మాంసం, ఫ్రోజెన్, బాటిల్ ఫుడ్ వంటి వాటి ప్రాథమిక శుద్ధికి, ఇర్రిడియేషన్, టెంపర్ హీట్, హీట్ వాటర్ ట్రీట్మెంట్ సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేసేలా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, తొలి దశ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతోంది.

నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..వారికే పదవులు.. కాంగ్రెస్ డెడ్ లైన్ అప్పటివరకే!
నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..వారికే పదవులు.. కాంగ్రెస్ డెడ్ లైన్ అప్పటివరకే!

తెలంగాణా రాష్ట్రానికి అపూర్వ ఘనత

హెలిపాడ్ తో పాటు అన్ని సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ కానుంది. తెలంగాణ రాష్ట్రం ఆ ఘనతను దక్కించుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+