శ్రీశైల ఆలయంలో భారీ ప్రక్షాళన - కీలక నిర్ణయాలు..!!

శ్రీశైలం వెళ్లే భక్తులకు కీలక అప్డేట్. ఆలయంలో దర్శనం సహా.. వసతుల పైన పాలక వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆన్ లైన్ విధానంలో దర్మన టోకెన్లు.. సమయం ఖరారు వంటి అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో పాలనా వ్యవహారాల్లో పూర్తి స్థాయి ప్రక్షాళనకు సిద్దమైంది. అందులో భాగంగా ఉద్యోగులను పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చగా మారుతోంది.

శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దర్శనాల్లోనూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పలు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఆన్ లైన్ విధానం అందుబాటు లోకి తీసుకొచ్చారు. తాజాగా ఆలయంలో పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం, విధుల సమర్థ నిర్వహణ కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు చేసినవే కాకుండా.. ఇంకా కొందరి బదిలీలు ఉంటాయని సమాచారం. శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అవసరమైన సిబ్బంది మార్పులు చేస్తున్నామని చెబుతున్నారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్ఠతకు అరుదైన గుర్తింపు- టీటీడీ 'బంగారం' లాంటి నిర్ణయం..!!
శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్ఠతకు అరుదైన గుర్తింపు- టీటీడీ 'బంగారం' లాంటి నిర్ణయం..!!
srisailam-temple-begins-major-administrative-overhaul-with-large-scale-staff-transfers

అధికారుల తాజా నిర్ణయాలు

కాగా, తాజా ఉత్తర్వుల మేరకు ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు సహా మొత్తం 23 మంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా కర్నూలు సమాచార కేంద్రంలో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న ఫణిధర్ ప్రసాద్‌ను శ్రీశైలం దేవస్థానం పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అలాగే ముగ్గురు ఏఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. మరో ఇద్దరు ఏఈవోలను ప్రస్తుతం నిర్వహిస్తున్న విభాగాల్లోనే కొనసాగిస్తూ అదనపు విధులను అప్పగించారు. వీటితో పాటు 17 మంది పర్యవేక్షకులను కూడా వివిధ విభాగాలకు మార్చారు. అన్ని విభాగాల్లో పారదర్శకత పెంచుతూ... భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనే లక్ష్యంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+