ఏపీ, తెలంగాణ ఎల్‌ నినో నుంచి బయట పడినట్లేనా, బిగ్ అప్డేట్..!!

ఎల్‌ నినో ప్రభావం వేళ వాతావరణంలో అనూహ్యంగా మార్పు కనిపిస్తోంది. వర్షాకాలం వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవటం లేదు. రుతుపవనాలు సైతం నిరాశపర్చాయి. దీంతో.. ఇక ఈ నెలలోనూ వర్షాలు కష్టమని అందరూ భావించారు. అయితే.. వాతావరణంలో వచ్చిన మార్పు తో కొద్ది రోజులుగా మార్పు మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతుండటంతో... తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో మళ్లీ జలకళ మొదలైంది. ఎల్ నినో కారణంగా కొద్ది రోజులుగా వర్షాలు కురవటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో క్రిష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి ఇన్ ఫ్లో పెరిగింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముంపు అలర్ట్స్ జారీ అవుతున్నాయి. కాగా, తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు వానలు అంతంత మాగ్రంగానే ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కాగా, గోదావరికి నీరు చేరడంతో కొంత సాగునీటికి ఇబ్బందులు తప్పినట్లేనని భావిస్తున్నారు.

 డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై బిగ్ ట్విస్ట్- వారి ఆశలు గల్లంతు..!!
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై బిగ్ ట్విస్ట్- వారి ఆశలు గల్లంతు..!!
imd-latest-predictions-over-heavy-rains-in-some-parts-of-telangana-and-rayala-seem-area-for-next-tw

వాతావరణ శాఖ తాజా సూచనలు

ప్రస్తుతం గోదావరి వరద నీటితో పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద లక్షల క్యూ సెక్కుల నీరు వృధాగా కిందకు వెళుతుంది. తాజా మరో రెండు రోజుల వర్షాలు కొనసాగుతాయనే వాతావరణ శాఖ తాజా హెచ్చరిక చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వానలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ లో తేలిక పాటి వానలు కురవున్నాయి. అటు తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని తెలిపింది. గత నాలుగు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో లోటు వర్షపాతం తగ్గిందని వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో ఐదు శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+