• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబైలో దొరికిన హెడ్లీ ఇంటి ఆచూకీ

By Pratap
|

Mumbai Blast
ముంబై: భారత్, డెన్నార్క్ ల్లో ఉగ్రవాద దాడులకు కుట్ర చేశాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న డేవిడ్ కోలెమన్ ముంబైలో నివాసం ఉన్న ఇంటిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కనిపెట్టింది. హెడ్లీని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ముంబైలో అతను బ్రీచ్ కాండీలోని శ్యాం నివాస్ హౌసింగ్ సొసైటీ అపార్ట్ మెంటులోని ఏ బ్లాక్ ఐదో అంతస్థు 56వ నెంబర్ ఫ్లాట్ లో ఉన్నట్లు కనిపెట్టారు. అతను ఇక్కడ పేయింగ్ గెస్టుగా ఉన్నట్లు ఎన్ఐఎ తెలుసుకుంది.

ఆ అపార్టుమెంటు అమెరికా కాన్సులేట్ కు అతి సమీపంలో ఉంది. నిరుడు ఏప్రిల్ నుంచి దాదాపు ఏడాది పాటు సింధీ దంపతుల వద్ద అతను ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్లీతో పాటు అతని సహచరుడు రాణా భారత్ లోని పలు ప్రాంతాల్లో తిరిగినట్లు తెలుసుకున్న దర్యాప్తు సంస్థలు వారు ఎక్కడెక్కడ సంచరించారనే విషయాన్ని కనిపెట్టడంలో మునిగిపోయాయి. తమ పాటు ఉన్న హెడ్లీ స్వీట్, చార్మింగ్ బాయ్ గా సింధీ దంపతులు అన్నారు. తమకు అతను ఏ విధమైన సమస్యను సృష్టించలేదని 75 ఏళ్ల శ్రీమతి కృపలానీ అన్నారు. ఆమె భర్త ఇటీవలే మరణించాడు. వారం రోజుల పాటు ఇంట్లో ఉండి రెండు, మూడు నెలల పాటు తిరగడానికి వెళ్లిపోయే వాడని ఆమె చెప్పింది.

ముంబై దాడులతో హెడ్లీ, రాణాలకు సంబంధం ఉందనే కోణం నుంచి కూడా దర్యాప్తు జరుగుతోంది. ముంబై దాడుల నిందితుడు కసబ్ వారికి తెలుసునని అనుమానిస్తున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూర్ పేలుళ్లతో వారి పాత్రను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X