ఆందోళనకరంగా 4గురు జూడాల ఆరోగ్యం

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లను అరెస్టు చేసేందుకు పోలీసులు మంగళవారం కూడా ప్రయత్నించారు. అయితే పోలీసులను జూనియర్ డాక్టర్లు లోనికి రానీయడం లేదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల గదికి సహచరులు తాళాలు వేశారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జూడాలను అరెస్టు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సోమవారం రాత్రి కొద్దిసేపు అత్యవసర సేవలను కూడా నిలిపేసిన జూడాలు మంగళవారం వాటికి హాజరయ్యారు. రోగులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తాము అత్యవసర సేవలకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications