పదవి వదిలేందుకు రాజ్ నాథ్ రెడీ

ఆయన వారసుడిగా మహారాష్ట్ర బిజెపి చీఫ్ నితిన్ గడ్కరీని ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ తన పదవిని వదిలేయడానికి సిద్ధపడ్డారు. తన బాధ్యతలను తన వారసుడికి అప్పగిస్తానని ఆయన అన్నారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను తేదీని ఖరారు చేసుకోలేదని ఆయన చెప్పారు. పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చి తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.సంస్థాగత ఎన్నికల సాధ్యమైనంత త్వరగా జరుగుతాయని, ఈ విషయంలో ఏ విధమైన జాప్యం జరగదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications