వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెడ్లీతో ఎమ్రాన్ హష్మీకి సంబంధాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Emraan Hashmi
న్యూఢిల్లీ: భారత్, డెన్మార్క్ ల్లో ఉగ్రవాద దాడులకు పథకం రచించాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న డేవిడ్ కొలెమన్ హెడ్లీతో బాలీవుడ్ కు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. డేవిడ్ కొలెమన్ హెడ్లీని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బిఐ) అరెస్టు చేసింది. దీంతో భారత దర్యాప్తు సంస్థలు భారత్ లో హెడ్లీ సంబంధాలపై దృష్టి పెట్టాయి. హెడ్లీతో బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమారుడు రాహుల్ కు సంబంధాలున్నట్లు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పది మందికి పైగా బాలీవుడ్ ప్రముఖులతో హెడ్లీకి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీకి హెడ్లీ తెలుసునని సిఎన్ఎన్ - ఐబిఎన్ ఒక వార్తా కథనం సారాంశం.

హెడ్లీతో హష్మీ ఫోన్ లో మాట్లాడినట్లు దర్యాప్తు సంస్థలు ఒక నిర్ధారణకు వచ్చినట్లు ఆ వార్తా కథనం తెలుపుతోంది. ఆ వార్తాకథనాన్ని బట్టి - రాహుల్ భట్ హష్మీకి హెడ్లీని పరిచయం చేశాడు. ఆ తర్వాత హష్మీ, హెడ్లీ రెండు సార్లు కలిశారు. హష్మీ నటించిన తుమ్ మిలె సెట్ లో వారిద్దరు కలిసినట్లు తెలుస్తోంది. వారిద్దరికి పరిచయం ఉన్న విషయాన్ని రాహుల్ భట్ దర్యాప్తు సంస్థలకు చెప్పినట్లు సమాచారం. హష్మీ మహేష్ భట్ సమీప బంధువు కూడా. రాహుల్ భట్ ను కేసులో సాక్షి చేర్చే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

హెడ్లీని రాహుల్ భట్ కొంత మంది హీరోయిన్లకు కూడా పరిచయం చేసినట్లు చెబుతున్నారు. రాహుల్ భట్ ను ముంబై విడిచి వెళ్లకూడదని భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఆదేశించింది. హెడ్లీ ముంబైలో ఉన్నప్పుడు కలిసినవారందరి వాంగ్మూలాలను కూడా సంస్థ రికార్డు చేస్తోంది. హెడ్లీ ముంబైలోని ఉన్న ఆపార్టుమెంటును కూడా అధికారులు కనిపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X