హెడ్లీతో ఆర్తి చాబ్రీయా చెట్టాపట్టాల్?

హెడ్లీతో సంబంధాలపై ఎన్ఐఎ ఐదుగురు బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించినట్లు సమాచారం. ఉగ్రవాద సంబంధాలపై బాలీవుడ్ ప్రముఖుల వాంగ్మూలాలు తీసుకుంటామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జికె పిళ్లై చెప్పారు. ఛాబ్రియా మిత్రుడు ఖలీద్ ను సంస్థ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీసా కోసం 2007లో ఖలీద్ హెడ్లీ సాయం కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే తాను హెడ్లీని కలవలేదని అతను చెప్పాడు. ఎమ్రాన్ హష్మీ, సోహా అలీఖాన్ సెట్స్ లో హెడ్లీని కలిసినట్లు తెలుసుకున్న దర్యాప్తు సంస్థ అధికారులు వారి ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
తాను హెడ్లీని కలిసినట్లు వచ్చిన వార్తలను ఆర్తి ఛాబ్రియా ఖండించింది. హెడ్లీ నివాసం ఉన్న శ్యాం నివాస్ కు కొద్ది బ్లాక్ ల దూరంలోనే తాను ఉంటున్నానని, అయితే హెడ్లీని తాను చూడలేదని ఆమె చెప్పింది. హెడ్లీతో పాటు రాహుల్ భట్ ఒకే జిమ్ కు వెళ్తున్నట్లు కూడా తనకు తెలియదని ఆమె వివరించింది.












Click it and Unblock the Notifications