జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ

హైదరాబాద్: ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్డర్లు మంగళవారం రాత్రి ఉపసంహరించుకున్నారు. వెంటనే విధులకు హాజరయ్యారు. వైద్య విద్యా శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డికి, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నిబంధనల వల్ల పెంచిన ఉపకార వేతనాల వివరాలు వెల్లడించడానికి వీలు కాదని మంత్రి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఉద్యోగుల మాదిరిగా వేతన స్థిరీకరణ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం అంగీకరించలేదు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల పరిస్థితి మంగళవారానికి విషమించింది. వారిని అరెస్టు చేసి వైద్య చికిత్స అందించడానికి పోలీసులకు వీలు కాలేదు. తమను అరెస్టు చేస్తే ఆత్మార్పణ చేసుకుంటామని వారు కిరోసిన్ డబ్బాలు దగ్గర పెట్టుకుని బెదిరించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు మంగళవారం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మెను విరమించకపోతే వారి డిగ్రీలను రద్దు చేయించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. సమ్మె చేస్తున్న డాక్టర్లపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఈ స్థితిలో మంత్రికి, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి. తీవ్ర ఒత్తిడికి గురైన జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ప్రతిపాదనలకే అంగీకరించాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+