రాహుల్ గాంధీ బెజవాడ పర్యటనపై ఉత్కంఠ

Rahul Gandhi
హైదరాబాద్: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విజయవాడ పర్యటన రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతికూల వాతావరణమే రాహుల్ పర్యటన రద్దుకు కారణమని భావిస్తున్నారు. విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయన విజయవాడ పర్యటన రద్దయినట్లు చెబుతున్నారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్వాగతం చెప్పాల్సి ఉంది. అయితే వీరు కూడా విజయవాడ వెళ్లలేదు. రాహుల్ గాంధీ జాతీయ అథ్లెట్ పోటీలకు రాహుల్ రావాల్సి ఉంది. అయితే వరంగల్ లో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే వరంగల్ కు రాహుల్ వస్తారని భావిస్తున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా, రాహుల్ గాంధీ తిరుపతికి నేరుగా వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయవాడలో ఆయన విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. చివరి నిమిషంలో రాహుల్ పర్యటన రద్దు కావడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే రాహుల్ వస్తారనే ఇంకా వేచి చూస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి పర్యటనకు బయలుదేరినట్లు సమాచారం అందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+