జగన్ ను సిఎంగా చూడాలని.. రాహుల్

Rahul Gandhi
విజయవాడ: కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయితే తనకూ చూడాలని ఉందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారం ఉదయం ఆయన ఇక్కడ లయోలా కాలేజీ విద్యార్థులతో ముఖాము మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి జగన్‌ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అందుకు ఆయన జగన్‌ ముఖ్యమంత్రి అయితే తనకూ చూడాలని ఉందన్నారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటని ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. అవినీతి, రాజకీయాలే ప్రధాన సమస్యలని వారు చెప్పారు. రిజర్వేషన్లను పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాదానం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. దేశవ్యతిరేకులపై సరైన చర్యలు తీసుకోవాలంటే దేశంలోని న్యాయవ్యవస్థ మరింత వేగవంతంగా పనిచేయాలన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+