హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ పై సినిమా మహా ప్రస్థానం పూర్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తలపెట్టిన రాజశేఖర రెడ్డి మహా ప్రస్థానం చిత్ర నిర్మాణం పూర్తయింది. చిత్రం షూటింగ్ కడప జిల్లా పులివెందులలో పూర్తయింది. కడప సింహంగా పేరు పొందిన వైయస్ రాజశేఖర రెడ్డి జీవత విశేషాలతో కూడిన చిత్రం షూటింగ్ ను గురువారం పూర్తి చేసుకున్నామని, మరో 20 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయని చిత్ర దర్శకుడు ఆదిత్య చెప్పారు.

అమ్మా ఆర్ట్ బ్యానర్ పై 90 నిమిషాల నిడివితో వైయస్సార్ మహాప్రస్థానం చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్ర నిర్మాణం 68 రోజుల్లో పూర్తయింది. వైయస్ రాజశేఖర రెడ్డి రెండు నెలల క్రితం కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత అమ్మా ఆర్ట్ ఈ సినిమా నిర్మాణానికి పూనుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X