ఆస్ట్రేలియాలో భారత దంపతులపై దాడి

రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో కుక్క మొరగడంతో తాను తలుపులు తీశానని, ఇద్దరు మహిళలు, ఒక యువకుడు కనిపించారని, వారిని వెళ్లిపోవాల్సిందిగా చెప్పానని రోడ్నీ ఒక భారత టీవీ చానెల్ తో చెప్పారు. అయితే వారు వినకుండా తమపై దాడి చేశారని ఆయన చెప్పారు. మూడు నాలుగు దెబ్బలకు తాను పడిపోయానని అతను చెప్పారు. తనను చంపుతానని యువకుడు బెదిరిస్తూ ఆ తర్వాత కూడా పిడిగుద్దులు గుద్దాడని ఆయన తెలిపారు. తన భార్య పరుగెత్తుకొచ్చిందని, ఆమెపై యువతులు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ బట్టలూడదీస్తానని అన్నారని, ఆమెను కాపాడడానికి తాను వెళ్లడంతో వారు మళ్లీ తనను కొట్టారని రోడ్నీ వివరించారు.












Click it and Unblock the Notifications