గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టాలి: విహెచ్

గాలి జనార్దన్ రెడ్డి హర్షద్ మెహతా కన్నా ఎక్కువ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మెహతాను పెట్టినట్లు గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థుల ఓటమికి గాలి జనార్దన్ రెడ్డి వంద కోట్ల రూపాయలు పంపించారని ఆయన ఆరోపించారు. కృష్ణపట్నంలో నిల్వ ఉన్న ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఓబుళాపురం ఖనిజాలను విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నాటక రాజకీయ వ్యవహారాల్లో బిజెపి నేతలు సుష్మా స్వరాజ్ కు, ఎం. వెంకయ్యనాయుడు ఎంత ముట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications