గ్రేటర్ ఎన్నికల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెం.

ఇందులో ఓటరు పేరుతో పాటు స్ర్తీ, పురుషుడు అయితే ఆ వివరాలు తెలియచేస్తే పోలింగ్ స్టేషన్, వార్డు, ఓటర్ల జాబితాలో పార్టు నెంబరు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చని సింగ్ తెలిపారు. అలాగే పోలింగ్ స్టేషన్, ఓటర్ల జాబితాలో వివరాలు తెలుసుకునేందుకు 155304 నెంబరుకు ఫోన్ చేస్తే క్షణాల్లో సమాచారం తెలియచేసేందుకు వీలుగా కాల్ సెంటర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. దీనికి తోడు ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు ఆయన వివరించారు.
ఎన్నికల ఫిర్యాదు కోసం...
ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు నిబంధనలు ఉల్లఘించి అక్రమాలకు పాల్పడితే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు పలు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తు, మధ్యం, డబ్బులు పంపిణీ చేస్తే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు, పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నెం.100, 1090కు ఫిర్యాదు చేయాలి. అలాగే 23261666, 9490616690కు గానీ, 9010106100, 9640100100కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. మధ్యం పంపిణీ, అక్రమ రావాణా, నిల్వ చేస్తే 21737780, 24657470కు ఫోన్ చేయాలి.












Click it and Unblock the Notifications