ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

మృతుడిని ముద్దాడ మల్లేష్ (40)గా పోలీసులు గుర్తించారు. అతని మామ సిద్దాంతపు ఆదినారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తన కుమార్తె నాగమణిని అల్లుడు కష్టాలు పెడుతుండటంతో చూడలేకే హత మార్చానని చెప్పాడు. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం నాగమణికి పాచిపెంట పెం టారావుతో వివాహం అయింది. ఐదేళ్ల క్రితం అతడు నాగమణిని విడిచి పెట్టా డు. తరువాత మల్లేష్‌ను పెళ్లి చేసుకుంది.
ఆపై పెద్దపల్లి లక్ష్మణరావు అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి మల్లేష్ ఇంటికి లక్ష్మణరావు వచ్చాడని ముగ్గురూ గొడవపడ్డారని, ఆ క్రమంలో నాగమణి, తండ్రి, ప్రియుడు కలిసి మల్లేష్‌ను హత మార్చారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications