జగన్ అయితేనే మంచిది: రవీంద్రనాథ్

పులివెందుల అభ్యర్థి విషయంలో తమ కుటుంబం కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తామని ఆయన చెప్పారు. తమ కుటుంబమంతా ఒకే మాట ఉంటుందని ఆయన అన్నారు. జగన్ అయితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తారని ప్రజలు అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ సతీమణి విజయలక్ష్మి పేరును పులివెందుల నియోజకవర్గానికి అధిష్టానం ఖరారు చేసినట్లు బుధవారం వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications