గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెసు ముందంజ

Congress
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో మజ్లీస్ ఉండడం గమనార్హం. గురువారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాలు వెలువడతున్న మరు క్షణం నుంచి కాంగ్రెసు ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లోని 150 డివిజన్లకు ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెసు 21 డివిజన్లలో, మజ్లీస్ 16 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. తెలుగుదేశం 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మజ్లీస్ తో పోటి పడుతోంది.

బిజెపి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. లోకసత్తా కూడా ఫలితాలు సాధించలేదు. స్వతంత్రులు, ఇతరులు రెండు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెసు ఆధిక్యంలో కొనసాగుతుందనే విషయాన్ని విశ్లేషకులు ఊహిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వామపక్షాలతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పటి వరుక 49 స్థానాల ఫలితాలు తెలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+