విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో సిఎం భద్రత: చీమల బారులా పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: ముఖ్యమంత్రులు జిల్లాల్లో పర్యటించేటప్పుడు అక్కడి పోలీసులు గట్టి భద్రత కల్పించడం మామూలే. ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనకు పోలీసులు మరో అడుగు ముందుకేసి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ గత ముఖ్యమంత్రుల రక్షణ ఏర్పాట్ల కంటే భిన్నంగా, అధికంగా వుండడమే విశేషం. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు వున్నాయో తెలియదు గాని ముఖ్యమంత్రి దగ్గరకు సన్నిహితంగా వెళ్లే అవకాశం ఒక్క మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కింది. మాజీలు, చోటాలు, కార్యకర్తలకు ముఖం చూసే అవకాశం కూడా దక్కలేదు. ఆయన బస చేసిన సర్క్యూట్‌ అతిథిగృహం నుంచి సమావేశాలు నిర్వహించిన గేట్‌వే, గ్రీన్‌పార్కు హోటళ్ల వరకూ పది అడుగులకు ముగ్గురు పోలీసులను చొప్పున నియమించారు.

రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌కు కేటాయించిన స్థలాల్లో కూడా వాహనాలు లేకుండా జాగ్రత్త వహించారు. గ్రీన్‌పార్కులో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశానికి మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్వయంగా పోలీసు కమిషనర్‌ జారీచేసిన పాసులు తీసుకువెళ్లినవారిని జిల్లా కలెక్టర్‌ పది నెలల క్రితం జారీ చేసిన అక్రిడిటేషన్‌ గుర్తింపుకార్డు కూడా చూపించమని ఒత్తిడి చేశారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు పోలీసు కమిషనర్‌ సాంబశివరావు ఆధ్వర్యంలో భద్రత కల్పించగా, గ్రీన్‌పార్కులో ఏర్పాట్లను లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ వేణుగోపాలరావు పర్యవేక్షించారు. సీఎం కార్యక్రమం జరిగిన ప్రతి గదిలోనూ ఆ భవంతికి సంబంధించిన నిర్మాణ ప్లాను గోడలకు అతికించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X