లోకసత్తా జెపికి సెటిలర్ల మొండిచెయ్యి?

Jayaprakash Narayana
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తా ఫలితాల సాధనలో పూర్తిగా విఫలమైంది. శాసనసభ ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ కూకట్ పల్లి స్థానాన్ని గెలుచుకున్నారు. శాసనసభలో ప్రదర్శించిన ఊపును కూడా జయప్రకాష్ నారాయణ ఈ ఎన్నికల్లో ప్రదర్శించలేకపోయారు. గ్రేటర్ హైదరాబాదులోని 150 డివిజన్లలో వంద డివిజన్ల ఫలితాలు తెలుస్తున్నప్పటికీ లోకసత్తా ఉనికి కనిపించలేదు. కూకట్ పల్లి శాసనసభా నియోజకవర్గంలో కూడా జెపి తన బలాన్ని ప్రదర్శించిన సూచనలు కనిపించడం లేదు. జయప్రకాష్ నారాయణ చెబుతున్న ఆదర్సాలు నోటి మాటకే పరిమితమయ్యాయనే భావన ప్రజల్లో నెలకొని ఉంటుంది.

కాగా, సెటిలర్లు జయప్రకాష్ నారాయణకు చేయి చూపినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ సెటిలర్లకు ఇచ్చిన హామీ, ప్రదర్శించిన తెలంగాణ వ్యతిరేక వైఖరి జయప్రకాష్ నారాయణపై దెబ్బ వేసి ఉంటుంది. అంతేకాకుండా పోలింగ్ కు ఒక రోజు ఆదివారం వల్ల సెలవు రావడం, అంతకు ముందు శనివారం కావడం, పోలింగ్ రోజు సోమవారం సెలవు కావడంతో కోస్తా సెటిలర్లకు పెద్ద సంఖ్యలో తమ స్వస్థాలాలకు వెళ్లిపోయారు. ఈ ప్రభావం కూడా లోకసత్తాపై పడినట్లు భావిస్తున్నారు. చిన్న పార్టీలకు ఓటేస్తే మురిగిపోతాయని, లోకసత్తా కాంగ్రెసు అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం కూడా ఆ పార్టీపై ప్రభావం చూపినట్లు భావించవచ్చు. పైగా, ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళనలో జయప్రకాష్ నారాయణ పాలు పంచుకోవడం వల్ల లోకసత్తా పార్టీపై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+