నేను ఉంటానో, ఉండనో..: కెసిఅర్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తానని, ఈ నెల 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. రెండు రోజుల పాటు కరీంనగర్ లో విశ్రాంతి తీసుకుని సిద్ధిపేటకు బయలుదేరి వెళ్లి దీక్ష ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. ఇది పార్టీలకోసమో, రాజకీయాల కోసమో సాగుతున్న ఉద్యమం కాదని, తెలంగాణ ప్రయోజనాల కోసం సాగుతున్న ఉద్యమమని ఆయన అన్నారు. కాగా, కెసిఆర్ ను దీక్షకు ముందే అరెస్టు చేయడానికి పోలీసులు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. అయితే తనను పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడే దీక్షను సాగిస్తానని ఆయన ఇదివరకు మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications