కరీంనగర్ లో 144వ సెక్షన్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో శనివారం పోలీసులు 144వ సెక్షన్ విధించారు. వరంగల్, కరీంగనగర్, మెదక్ తదితర జిల్లాల్లో పోలీసులు పెద్ద యెత్తున తెరాస నాయకులను, కార్యకర్తలను అరెస్టు చెస్తున్నారు. సిద్ధిపేటలో కెసిఆర్ నిరాహార దీక్ష చేసే వేదిక ప్రాంగణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు కూడా జరిగాయి. రామాయంపేట, తదితర మెదక్ జిల్లాల్లోని తెరాస నాయకులకు, కార్యకర్తలకు పోలీసులు బైండోవర్ నోటీసులు జారీ చేశారు.

కరీంనగర్ లో కెసిఆర్ నివాసం వద్ద తెరాస కార్యకర్తలు పోలీసుల కాళ్లు మొక్కారు. గన్ డౌన్ చేయాలని వారు పోలీసులను వేడుకున్నారు. కెసిఆర్ దీక్ష నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ లోనే కాకుండా ఆ జిల్లాలోని ఏటూరు నాగారం తదితర ప్రాంతాల్లో అరెస్టులు జరిగాయి. తెరాస కార్యకర్తలు సిద్ధిపేటకు, కరీంనగర్ కు చేరుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+