కెసిఆర్ అప్పుడెందుకు నోరెత్తలేదు: జీవన్

Jeevan Reddy
హైదరాబాద్: తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అంశాలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఎందుకు నోరెత్తలేదని కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ ఇప్పుడు ఏ అంశాలపై మాట్లాడుతున్నారో గతంలో ఆ అంశాలకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఅర్ ను ఆయన పచ్చి అవకాశవాదిగా అభివర్ణించారు. పోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవడానికే కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కెసిఆర్ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణ నినాదం కెసిఆర్ సొంతం కాదని ఆయన అన్నారు. కెసిఆర్ ఉద్యమం కాంగ్రెసుకు వ్యతిరేకంగా సాగుతుంటే కెసిఆర్ కు తమ పార్టీ నాయకులు జి. వెంకటస్వామి, మధు యాష్కీ మద్దతు తెలపడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+