చంద్రశేఖర రావుకు గృహ నిర్బంధం?

ఎక్కడ అరెస్టు అక్కడ కెసిఆర్ తన దీక్షను ప్రారంభిస్తారని నాయని నర్సింహారెడ్డి చెప్పారు. అరెస్టు చేసి జైల్లో పెడితే జైల్లో దీక్ష చేస్తారని ఆయన చెప్పారు. కెసిఆర్ దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లర్లకు దిగదలుచుకోలేదని, తమ పార్టీ కార్యకర్తలు కూడా గొడవలు చేయబోరని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ దీక్ష నేపథ్యంలో శనివారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కె రోశయ్యతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications