దీక్షా వేళ కాదు, తెలంగాణ వస్తుంది: పాల్వాయి

P Govardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షలు సమయం ఇది కాదని కాంగ్రెసు నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సమస్యలకు తెలంగాణ ఏర్పాటు ద్వారానే పరిష్కారం లభిస్తుందని, తెలంగాణ రావాల్సిన సమయంలో వస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ అంశం రాష్ట్ర పరిధిలో లేదని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆయన అన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం అవసరమని ఆయన అన్నారు.

దీక్షల వల్ల తెలంగామ రాదని పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. తమకు కూడా తెలంగాణ రావాలనే ఉందని మరో కాంగ్రెసు సీనియర్ నాయకుడు అమోస్ అన్నారు. కెసిఆర్ తన ఆమరణ నిరాహార దీక్ష ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ కోసం ఢిల్లీలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+