కెసిఆర్ అరెస్టు తొందరపాటు:ప్రజా సంఘాలు

K Chandrasekhar Rao
హైదరాబాదు: టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుని అరెస్ట్‌ చేయడంలోగానీ, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీ చార్జీ చేసే విషయంలోగానీ ప్రభుత్వం, పోలీసులు తొందపడ్డారని రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన పలు ఉద్యమాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈరోజు సాక్షిటివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో తెలంగాణ విమోచన సమితి (టివిఎస్‌) నేత ప్రకాష్‌, మాజీ ఎంపి యలమంచిలి శివాజీ, ఉత్తరాంధ్ర పోరాట సమితి అధ్యక్షుడు జె.టి.రామారావు, తెలంగాణ సెటిలర్స్‌ ఫ్రోరం నేత శ్రీనివాస రాజు పాల్గొన్నారు.

ప్రకాష్‌ మాట్లాడుతూ ఎప్పుడూ లేనంత ఉద్యమం ఈరోజు వచ్చిందన్నారు. 40 దేశాల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్‌ది కాదని, ఇది 1969లో కాంగ్రెస్‌ డిమాండ్‌ అని ఆయన తెలిపారు. కొండా లకణ్‌ బాపూజీ ఆనాడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారన్నారు.

ఎన్నికల సమయంలో తెలంగాణకు మద్దతు తెలిపిన పార్టీలు ఈరోజు ఒక్క మాట మాట్లాడటంలేదని శ్రీనివాస రాజు అన్నారు. విద్యార్థులకు ఆవేశం ఎక్కువని, జరగరానిది జరిగితే ప్రభుత్వం, రాజకీయ పార్టీలే బాధ్యత వహించవలసి వస్తుందన్నారు.రాయలసీమ హక్కుల ఉద్యమ నేత సిహెచ్‌. చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కెసిఆర్‌తో ఫోన్‌లోనైనా మాట్లాడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+