వ్యూహాత్మకంగా కెసీఅర్ అరెస్ట్, ఉద్రిక్తత

జనం పెద్దగా లేని అలుగునూరు కూడలి దగ్గర కేసీఆర్ వాహానాన్ని పార్టీ శ్రేణుల కాన్వాయ్‌నుంచి చాకచక్యంగా తప్పించారు. దీంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది. కేసీఆర్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సులో తీసుకొని వరంగల్ వైపుకు తీసుకువెళ్లారు. వరంగల్ ఎస్పీ సజ్జనార్ కేసీఆర్ వెంట ఉన్నారు.
తెరాస అధినేత కేసీఆర్‌ను అరెస్టు చేసిన అలుగునూరు కూడలి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అరెస్టును నిరసిస్తూ వందలాదిమంది కార్యకర్తలు రహదారిపై బైఠాయించారు. ఇదిలావుండగా పార్టీ సిద్దాంతకర్త జయశంకర్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications