కెసిఆర్ అరెస్టును ఖండించిన తెలంగాణ ఎన్నారైలు

టీఅర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావును అరెస్టు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వికృత ఫాసిస్టు ముఖాన్ని బహిర్గతం చేసుకుందని తేనా విమర్శించింది. రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆంధ్రా నాయకులు రజాకార్ల కంటే, బ్రిటీషు పాలకుల కంటే క్రూరంగా వ్యవరించారని ఆరోపించింది. కెసిఆర్ ఆమరణ దీక్ష తలపెట్టినప్పటి నుంచి ప్రభుత్వం, పోలీసు వ్యవహరిస్తున్న తీరు విచారకరమని, అనాగరికమని అభివర్ణించింది.
ప్రస్తుతం తెలంగాణ పోలీసుల అణచివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని తేనా పేర్కొంది. ఈ చారిత్రక సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గొంతెత్తి తమ అభిప్రాయాలను వెల్లడించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ అప్రజాస్వామిక, ఫాసిస్టు చర్యలను టిడిపి, సిపిఎం, సిపిఐ, పిఆర్పీలు కూడా ఖండించాలని కోరింది.












Click it and Unblock the Notifications