కెసిఆర్ తో చర్చలకు కాంగ్రెస్ సీనియర్ల ఒత్తిడి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆయన విమర్శించారు. పోలీసులకు అప్పజెప్పి తమ బాధ్యత అయిపోయిందని ప్రభుత్వం అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని అనడం పార్టీ వ్యతిరేకం గానీ దేశవ్యతిరేకం గానీ కాదని, తాము కూడా తెలంగాణ కావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. కెసిఆర్ పార్టీని ఏర్పాటు చేయక ముందు నుంచి కూడా తాము ఈ డిమాండ్ చేస్తూ వస్తున్నామని ఆయన చెప్పారు. కెసిఆర్ డిమాండ్ తో తమకు ఏకీభావం ఉందని ఆయన చెప్పారు. అందరం కలిసి తెలంగాణ సాధనకు ప్రయత్నాలు సాగిద్దామని, దీక్ష విరమించాలని ఆయన కెసిఆర్ ను కోరారు.












Click it and Unblock the Notifications