రెండో రోజూ జైల్లో కెసిఆర్ ఆమరణ దీక్ష

కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే బిపి పడిపోయిందని అంటున్నారు. గంట గంటకూ వైద్యులు విడతల వారీగా కెసిఆర్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఎవరూ ప్రాణత్యాగానికి పాల్పడవద్దని, హింసకు దిగవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం సబ్ జైల్లో కెసిఆర్ ను పెట్టడం పట్ల కెసిఆర్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జైల్లో ముఖ్యనేతలు ఎవరినీ ఉంచరు. జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఏమీ తీసుకోకపోతే మాత్రం ఆయన ఆరోగ్యం విషమిస్తుందని వైద్యులంటున్నారు.












Click it and Unblock the Notifications