కెసిఆర్ తరలింపునకు హెలికాప్టర్ సిద్ధం

జైల్లో కూడా నిరాహార దీక్ష చేస్తున్న కెసిఆర్ మందులు కూడా తీసుకోవడం లేదని వైద్యులు చెప్పారు. ఏ సౌకర్యాలు లేని ఖమ్మ సబ్ జైల్లో కెసిఆర్ ను పెట్టి అవమానిస్తున్నారనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఆయన పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడం లేదని వైద్యులు చెప్పారు. ఖమ్మంలో మరోసారి కెసిఆర్ ను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాదుకు తరలించే అవకాశాలున్నాయి. ఆయనను కోర్టుకు తరలించడానికి పది వాహనాలను సిద్ధం చేశారు. కెసిఆర్ తో వైద్యులు, సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వర రావు చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications