పాములాగా ప్రవర్తించిన రైతు... వింత సంఘటన

ఈ సమయంలో తెల్ల తాచు పాము అతనిపైకి దూసుకురావడంతో కర్రతో కొట్టి చంపాడు. చంపిన పామును తీసుకొచ్చి సమీపంలోని తొమ్మిదో నంబరు జాతీయ రహదారి పక్కనే పడవేశాడు. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలోని ఇంటికి చేరుకున్న రైతు హఠాత్తుగా కింద పడిపోయాడు. కంగారుపడిన భార్య ఇరుగుపొరుగు వారిని పిలిచింది. మరికొద్ది నిమిషాలకు వెంకటేశ్వరరావు పాములా నాలుక ఆడిస్తూ, పాకుతూ ఇంటి నుంచి రోడ్డు వైపునకు రావడానికి ప్రయత్నించాడు.
అక్కడకు చేరుకున్న గ్రామస్తులు ఈవింత ప్రవర్తన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పాకుతున్న అతన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఎక్కడకు వెళ్లాలనుకుంటున్నాడో తెలియక అయోమయంలో పడ్డారు. ఈ సమయంలో వెంకటేశ్వరరావు పామును చంపి రోడ్డు పక్కన వేయడాన్ని గమనించిన సర్పంచ్ జోగి ఏసుప్రభు పరిస్థితిని స్థానికులకు వివరించాడు. చనిపోయిన పాము వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన సర్పంచ్, గ్రామస్తులు అతన్ని బలవంతంగా జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు పూనుకున్నారు.
ఇదీ విఫలం కావడంతో మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పాకుతూ వెళుతున్న వెంకటేశ్వరరావు వంటిపై పసుపు, కుంకుమ జల్లుకుంటూ చనిపోయిన పాము వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ కూర్చోబెట్టి పూజలు చేశారు. చనిపోయిన పాముకు దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వరరావు సాధారణ స్థితికి చేరుకున్నాడు. గతంలోనూ ఈ రైతు కుటుం బంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై 3 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
పామును చంపిన వ్యక్తి పాములా ప్రవర్తించడం కేవలం హిస్టిరికల్ రియాక్షన్ మాత్రమేనని పామును చంపాను కాబట్టి పాము ఆత్మ తనను ఆవహించిందనే భ్రమతో, భయంతో వెంకటేశ్వరరావు ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చని డాక్టర్లు చెప్పారు.












Click it and Unblock the Notifications