విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేటి నుంచి కనక దుర్గ గుడిలో డ్రెస్ కోడ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanakadurga Temple
విజయవాడ: ఆలయ సిబ్బందిలో క్రమశిక్షణ పెంపొందించేందుకు దుర్గ గుడిలో మంగళవారం నుంచి డ్రెస్ కోడ్‌ అమలు చేయనున్నట్లు ఆలయ ఈవో విజయకుమార్‌ తెలిపారు. సిబ్బంది డ్రస్‌కోడ్‌కు అనుగుణంగా దుస్తులు ధరించి విధులకు హాజరుకావాలన్నారు. ఆ నిబంధన పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. దుస్తులపై అమ్మవారి లోగో ముద్రించడంలో జరిగిన జాప్యం వల్ల అవి అందలేదని, మంగళవారం ఉదయానికి సిబ్బంది మొత్తానికి దుస్తులు అందజేస్తామన్నారు.

ఆలయ ఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే సిబ్బందిలో క్రమశిక్షణారహిత్యాన్ని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న విషయాన్ని విజయ్‌కుమార్‌ గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిలో క్రమశిక్షణను పెంపొందించేందుకు డ్రస్‌కోడ్‌ అమలు చేయాలని నిర్ణయించారు. అధికారులతో పాటు తాత్కాలిక సిబ్బందికి కూడా దేవస్థానమే డ్రస్‌ను అందించే ఏర్పాట్లు చేశారు.

దేవస్థానంలో సోమవారం వేకువజామున ఈవో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్‌గా, స్టోర్స్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న వీ నాగేశ్వరరావు హజరుపట్టీలో సంతకాలు చేసి విధులకు హాజరు కాని విషయాన్ని గుర్తించారు. ఆదివారమే హాజరుపట్టీలో సంతకం చేసి అతడు సోమవారం విధులకు హాజరుకాలేదు. అతడిని ఆ విభాగాల నుంచి దుర్గాఘాట్‌కు మార్చారు. నాలుగు నెలల్లో నాగేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నందున మానవతా దృక్పధంతో వదిలేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో అమృతరావు అనే ఉద్యోగిని నియమించారు. ఇదే విధంగా సంతకం చేసి విధులకు హాజరుకాని అర్చకుడు శాండిల్యపై కూడా చర్యలు తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X