ఖమ్మం ఆస్పత్రిలో కెసిఆర్ ఆత్మహత్యా యత్నం!

K Chandrasekhar Rao
ఖమ్మం: ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్‌ మంగళవారం ఒకదశలో అద్దం పగలగొట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు, తెరాస నేతలు ఆయన్ని అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌కు, నాయిని నర్సింహారెడ్డి చేతికి గాయాలయ్యాయి. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి బయట పోలీసులకు పీడీఎస్‌యూ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసీఆర్‌కి మద్దతుగా వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో భారీర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు కేసీఆర్‌ని ప్రభుత్వాసుపత్రినుంచి సబ్‌జైలుకి తరలించే అవకాశం ఉంది. కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతుందని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ.చంద్రశేఖర్‌ చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో తెరాస శ్రేణులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆయన పిలుపిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+