తెలంగాణపై కాంగ్రెసు ఒక్కటే చేయలేదు: రోశయ్య

Rosaiah
న్యూఢిల్లీ: కేంద్రంలో యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందున కాంగ్రెసు ఒక్కటే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సరిపోదని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. తెలంగాణపై ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించారు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వం కాదని, యుపిఎ ప్రభుత్వమని గుర్తించాలని ఆయన అన్నారు. తెలంగాణ సీరియస్ అంశమేనని, అందువల్ల సమస్య పరిష్కారానికి సమయం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య తేలిగ్గా పరిష్కారమయ్యేది కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తెలుసునని, కెసిఆర్ ఓపిక పట్టాలని ఆయన అన్నారు. కెసిఆర్ ఆందోళనపై తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తానని ఆయన చెప్పారు.

తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ తీవ్రంగానే తీసుకుంటోందని ఆయన చెప్పారు. ఉద్యమాలు చేసుకోవచ్చునని, అయితే అవి శాంతియుతంగా సాగాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశం సోనియా పరిధిలో ఉందని, సోనియా పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై కెసిఆర్ ఉద్యమాన్ని కాంగ్రెసు అధిష్టానం దృష్టికి తీసికెళ్తానని ఆయన చెప్పారు. తెలంగాణపై సోనియా నిర్ణయానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎవరి ప్రాణాలకు కూడా హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+