కెసిఆర్ ను ఖమ్మం నుంచి తరలించండి: హెచ్ఆర్సీ

కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి ప్రతినిధి కవిత మరోసారి బుధవారం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ ప్రతిస్పందించింది. కెసిఆర్ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అందువల్ల కెసిఆర్ నిరాకరించినా బలవంతంగానైనా చికిత్స అందించాలని చెప్పారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి కెసిఆర్ ఆరోగ్యానికి సంబంధించిన కేసు షీట్ ను తమకు ఫ్యాక్స్ చేయాలని ఆయన ఆదేశించారు. కెసిఆర్ దగ్గర నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించాలని కూడా ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications