జలగం వెంకటరావు ఆఫీసుపై దాడి

తన కార్యాలయంపై దాడి చేసినవారు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలా, వేరేవాళ్లా అనేది తాను చెప్పలేనని ఆయన అన్నారు. సంఘటనా స్థలంలో తెరాస జెండా ఉండడంపై ప్రశ్నించగా కాంగ్రెసు జెండానైనా ఉండవచ్చు, తెరాస జెండానైనా ఉండవచ్చు, జెండా ఉన్నంత మాత్రాన వారే దాడి చేశారని చెప్పలేమని ఆయన అన్నారు. తనకు ఎవరి మీదా అనుమానాలు లేవని, పోలీసులే ఆ విషయం చూసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ అంశం ఇప్పటికిప్పుడు పరిష్కారమయ్యేది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications