దాడులకు భయపడేది లేదు: రేణుకా చౌదరి

Renuka Chowdary
న్యూఢిల్లీ: బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. తన ఇంటిపై, క్యాంపు కార్యాలయంపై ఎవరు దాడులు చేశారనే విషయాన్ని పోలీసులు తేలుస్తారని ఆమె బుధవారం ఒక మీడియా చానెల్ ప్రతినిధితో అన్నారు. తనకు అదనపు భద్రత అవసరం లేదని ఆమె చెప్పారు. ఖమ్మంలో ఉండే హక్కు రాజ్యాంగపరంగా తనకు ఉందని ఆయన అన్నారు. దాడులు ఎవరు చేసినా అసాంఘిక శక్తుల పనే అని ఆమె అన్నారు. వారెవరనేది పోలీసులు తేలుస్తారని ఆమె అన్నారు. దాడులు చేయడం తమ తెలంగాణ సంస్కృతి కాదని, తెలంగాణ ప్రజలు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేయమన్నారని ఆమె అడిగారు. ఎవరో ఇవ్వాలని అడిగినంత మాత్రాన తాము తెలంగాణ ఇచ్చే స్థితిలో లేమని ఆమె అన్నారు. పచ్చి అవకాశంవాదంతోనే కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

తెలంగాణ సాధనకు ఒక పద్ధతి ఉందని ఆమె అన్నారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ తీవ్రంగా ఆలోచన చేస్తోందని ఆమె అన్నారు. తెలంగాణ విషయంలో తామిచ్చేది బహుమతి కాదని, తమ బాధ్యత అని ఆమె అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసి, తెలంగాణలో ఉద్యోగావకాశాలు పెంచాల్సిన బాధ్యత తమపై ఉందని ఆమె అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోందని ఆమె చెప్పారు. బస్సుల దగ్ధం, దాడులు సరైన మార్గం కాదని ఆమె అన్నారు. దాడి విషయాన్ని తాను కెసిఆర్ తో చెప్పలేదని, అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఆమె అన్నారు. దాడులు చేసినవారు ఆలోచించుకోవాలని ఆమె అన్నారు. పార్టీలోని అంతర్గత శత్రువుల పాత్ర దాడి వెనక ఉందా అని ప్రశ్నిస్తే దాడి చేసింది ఎవరనేది పోలీసులు తేలుస్తారని ఆమె జవాబిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+