ఖమ్మం అస్పత్రి వద్ద ఉద్రిక్తత: ఆందోళనలు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును ఉంచిన ఖమ్మం ఆస్పత్రి వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. కెసిఆర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస కార్యకర్తలు, న్యూడెమొక్రసీ, పిడిఎస్యూ కార్యకర్తలు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు ఆస్పత్రి లోపలికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో తీవ్రమైన తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల ప్రయత్నంలో కిందపడిపోయన పిడిఎస్యూ మహిళా కార్యకర్త స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు అలాగే ఆమెను ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నర్సయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, తెలంగాణ అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణపై వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, కెసిఆర్ దీక్షకు మద్దతుగా ఈ ఆందోళనలు సాగాయి. ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. తెలంగాణ విద్యార్థి సంఘం కార్యకర్తలు హైదరాబాదులోని ప్రదర్శన నిర్వహించి ముఖ్యమంత్రి రోశయ్య దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెరాస నాయకులు తెలంగాణ అంతటా నిరాహార దీక్షలకు దిగారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలోని రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులు వేలాది మంది ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. గంటలపాటు వరంగల్ లోని ఒక టీవీ చానెల్ కార్యాలయంలో తలదాచుకున్న తెరాస శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ వెలుపలికి రాగానే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టు కోసం పోలీసు అధికారులు, పోలీసులు గంటల తరబడి టీవీ చానెల్ కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. వినయ్ భాస్కర్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దీక్షలు చేస్తున్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య, మాజీ మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. తెలంగాణలోని కొన్ని చోట్ల బుధవారం కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+