విశాఖ-షిర్డీ ప్రత్యేక రైలు మరో నెలరోజులు

Shiridi Train
హైదరాబాద్‌: విశాఖపట్నం-షిర్డీ-విశాఖప ట్నం ప్రత్యేక రైలును మరో నెల రోజులపాటు పొడిగించాలని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయించింది. దీంతో ఈ నెలాఖరు వరకూ రైలు నడుస్తుంది. ఈ నెల 2, 5, 9, 12, 16, 19, 23, 26, 30 తేదీల్లో విశాఖపట్నంనుంచి ఉదయం 5-30 గంటలకు బయలుదేరే ఈ సర్వీసు ఆ మరుసటి రోజుల్లో ఉదయం 11 గంటలకు షిర్డీ చేరుకుంటుంది.

తిరుగుప్రయాణంలో షిర్డీ నుంచి ఈ నెల 3, 8, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి ఆ మరుసటి రోజుల్లో రాత్రి 10-45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, కాజీపేట, సికింద్రాబాద్‌, బొల్లా రం, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, నాందేడ్‌, పర్బని, ఔరంగాబాద్‌, నాగర్సోల్‌, మన్మాడ్‌ల మీదు గా ఈ సర్వీసులు ప్రయాణిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+