పుట్టిన ఊరికి ఏం చేశావ్? అక్కినేనికి చేదు అనుభవం

అక్కినేని మాట్లాడుతూ తాను, అట్లూరి స్వామి రామాపురంలో జన్మించగా, ఏఎస్ నారాయణ సమీపంలోని వెన్ననపూడిలో జన్మించారని, తాము ముగ్గురం చిన్ననాటి స్నేహితులుగా సొంత గడ్డకు చేయూతనివ్వాలని సంకల్పించామన్నారు.
భారతదేశంలో పుట్టి విదేశాల్లో నివసిస్తున్న వారందరూ వారి ఆదాయంలో 5 శాతం మొత్తాన్ని తాము జన్మించిన ప్రాంతాలకు సాయంగా అందించి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ పీయూష్‌కుమార్ మాట్లాడుతూ అక్కినేని పుట్టిన గ్రామానికి సేవ చేయడం అభినందనీయమన్నారు.
మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతూ కుదరవల్లి వద్ద వంతెన నిర్మాణానికి అక్కినేని చొరవ తీసుకున్నారన్నారు. అమల మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమకు ఉన్న చెడు అలవాట్లను మానుకుంటే సుఖంగా జీవించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications