నా చేతుల్లో ఉంటే ఇప్పుడే ఇచ్చేవాడ్ని: డి శ్రీనివాస్

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమనేది తన చేతుల్లో ఉంటే ఇప్పుడే ఇచ్చి ఉండేవాడ్ని అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసును వేలెత్తి చూపితే లాభం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికే ముఖ్యమంత్రి రోశయ్య అన్ని పార్టీలతో సభా సంఘాన్ని వేయడానికి ముందుకు వచ్చారని, ఈ కమిటీలో తెరాస చేరాలని ఆయన అన్నారు. తెరాస కూడా ఆ సభా సంఘంలో చేరితే ఐదారు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కొందరికి అనుమానాలున్నాయని, ఆ అనుమానాలు నివృత్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి వీలుంటుందని ఆయన అన్నారు. తెలంగాణకు యుపిఎ అనుకూలంగా ఉందని, అయితే తెలంగాణ ఏర్పాటుకు కొన్ని ఆటంకాలున్నాయని, ఆ ఆటంకాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదక సమర్పణలో ఎందుకు జాప్యం జరిగిందో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమాధానం చెప్పాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ శక్తులు ఉంటే ఉండవచ్చునని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిపై రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+