శరద్ పవార్ తో తెరాస బృందం భేటీ

తెరాస ప్రతినిధులు కేంద్ర మంత్రి మమతా బెనర్జీ, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ లతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా బిజెపి అగ్రనేతలు ఎల్ కె అద్వానీ తదితరులతో వారు మాట్లాడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు బిజెపి అగ్రనేతలను కోరే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెసు సీనియర్లతో వారు మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కెసిఆర్ దీక్ష విరమించి చర్చలకు ఢిల్లీ రావాలని కాంగ్రెసు సీనియర్లు కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీకి అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications